PM Modi: టెలికాం రంగంలో భారత్ పురోగతి సాధించింది

PM Modi: ఒకప్పుడు 2G కనెక్టివిటీతో సవాళ్లను ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు 5G నెట్‌వర్క్‌లను విజయవంతంగా విస్తరించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Update: 2025-10-08 07:57 GMT

PM Modi: ఒకప్పుడు 2G కనెక్టివిటీతో సవాళ్లను ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు 5G నెట్‌వర్క్‌లను విజయవంతంగా విస్తరించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా టెలికాం రంగంలో సాధించిన పురోగతిని మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు.

ఢిల్లీలోని ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో మోడీ ప్రసంగించారు. IMC ఈవెంట్‌లు ఇకపై కేవలం మొబైల్, టెలికాంలకే పరిమితం కాలేదు.. కొన్నేళ్లలో IMC ఈవెంట్ ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమ్‌గా మారుతుందన్నారు.

Tags:    

Similar News