Narendra Modi: కోవిడ్ కట్టడికి నేడు మోడీ కీలక సమావేశాలు

Narendra Modi: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ దూసుకెళ్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి.

Update: 2021-04-23 02:20 GMT

ప్రధాని నరేంద్ర మోడీ (ఫొటో ట్విట్టర్)

Narendra Modi: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కరోనా కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. అయినా.. పాజిటివ్‌ కేసులు అదుపులోకి రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి ఇవాళ మోడీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో కోవిడ్‌ నియంత్రణ కోసం ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు. తర్వాత కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం ఆక్సిజన్‌ తయారీదారులతో భేటీ కానున్నారు. అయితే.. ఒకేరోజు మోడీ మూడు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్‌ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి వర్చువల్‌ సమీక్ష చేశారు. ఆక్సిజన్‌ అన్ని రాష్ట్రాల్లోనూ లభ్యమయ్యే మార్గాలపై సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన ప్రయత్నాలను అధికారులు మోడీకి వివరించారు. మరోవైపు కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని WHO హెచ్చరిస్తోంది.

చెప్పాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం వేగంగా పెరుగుతోంది. దీంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వ్యాప్తించడంతో వలస కూలీలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్‌, ముంబై తదితర ప్రాంతాల నుంచి వలస జీవులు ముల్లెమూట సర్దుకుని స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. కాగా.. విజృంభిస్తోన్న కరోనా వల్ల మోడీ బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News