ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ వడోదరలో పోలీస్ టెక్నాలజీపై వివిధ రాష్ట్రాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అయితే, ఈ ఎగ్జిబిషన్లో ఏపీ పోలీస్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్పందన, వీక్లీ-ఆఫ్, ఫింగర్ అండ్ ఫేస్ సిస్టమ్, ఈ-విజిట్, డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మానటరింగ్తో స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే, ఏపీ స్టాల్ను ప్రత్యేకంగా పరిశీలించిన ప్రధాని మోడీ స్పందన, వీక్లీ-ఆఫ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పందన, వీక్లీ-ఆఫ్ విధానాన్ని ప్రశంసించిన ప్రధాని పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.