PM Modi: మా లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుంది
Parliament Session: 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమదని ప్రధాని మోడీ అన్నారు.
PM Modi: మా లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుంది
Parliament Session: 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమదని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృతకాల సమయంలో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ దేశ ప్రజలకు ఎంతో ముఖ్యమని చెప్పారు. తమ లక్ష్యానికి ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.