శ్రీలంక ప్రధానితో మాట్లాడిన మోదీ

Update: 2019-04-21 14:22 GMT

ఈస్టర్ పర్వదినాన వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజధాని కొలంబో అట్టుడికిపోయింది. ఉగ్రవాదులు పన్నిన కుట్రకు 2017 మందికి పైగా మరణించగా, 450 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా ఈ విషాద ఘటనను తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే శ్రీలంక ప్రధానితో ఫోనులో మాట్లాడారు. ఈ సందర్బంగా శ్రీలంకకు ఎటువంటి సహాయసహకారాలు అందిచడానికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఉగ్రవాదుల చర్యను పూర్తిగా ఖండించిన మోదీ ఇది అత్యంత దారుణమైన చర్య.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానూభూతి, శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Similar News