Plasma Bank in Delhi: ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం : సీఎం అరవింద్ కేజ్రీవాల్

Plasma Bank in Delhi: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చికిత్స‌లో ప్లాస్మా థెరిపి కీల‌కంగా మారింది.. అయితే త‌మ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Update: 2020-06-29 08:02 GMT

Plasma Bank in Delhi: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చికిత్స‌లో ప్లాస్మా థెరిపి కీల‌కంగా మారింది.. అయితే త‌మ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ....ప్లాస్మా కొర‌త ఉన్నందువలన దానిని అధిగమించేందుకు ఐఎల్‌బీఎస్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయన వెల్లడించారు. ఇక కరోనా నుంచి కోలుకున్నారు ప్లాస్మాను దానం చేయాల‌ని ఆయ‌న కోరారు..

ఇక ఢిల్లీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రోజురోజుకు అక్కడ కరోనా తీవ్రత పెరుగుతూ పోతుంది.. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది అంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు .. ఆదివారం నాటికి ఉన్న సమాచారం మేరకు ఢిల్లీలో గత 24 గంటల్లో 2,889 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 65 మంది మరణించారు. 3,306మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 83,077కి చేరింది. కరోనా తీవ్రతను అడ్డుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,459 కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం 5,48,318 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,10,120 ఉండగా, 3,21,722 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,475 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Tags:    

Similar News