ఢిల్లీలో ఈ రూల్స్ పాటించాల్సిందే.. చర్చించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఢిల్లీలో ఈ రూల్స్ పాటించాల్సిందే.. చర్చించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
x
Highlights

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వాలు నడుంబిగించాయి. లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో విచ్ఛలవిడిగా తిరుగుతున్న ప్రజలపై భారీగా...

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వాలు నడుంబిగించాయి. లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో విచ్ఛలవిడిగా తిరుగుతున్న ప్రజలపై భారీగా జరిమానాలు విధించాలని ఒక పక్క నిర్ణయించగా, మరో పక్క పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వీలైనన్ని బెడ్ లను అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా క‌ట్ట‌డికి దేశ రాజ‌ధాని ఢిల్లీ కొత్త‌గా అడుగులు వేయ‌బోతుంది. రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నందున… క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం, ఢిల్లీ ప్ర‌భుత్వం క‌లిసి కొత్త నిర్ణ‌యాలు తీసుకుంది. క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌వుతున్నందున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు, ఎయిమ్స్ డైరెక్ట‌ర్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఢిల్లీ ఎల్జీ కూడా హ‌జ‌ర‌య్యారు.

రాష్ట్రంలోని స‌మావేశ మందిరాల‌ను ఆసుప‌త్రులుగా మార్చాల‌ని, రైల్వే శాఖ ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 500కోవిడ్ బోగీల‌ను తీసుకోవాల‌ని, హోట‌ల్స్ ను కూడా క‌రోనా చికిత్స కేంద్రాలుగా ఉప‌యోగించుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక ఫేస్ మాస్ ధ‌రించ‌కున్నా, భౌతిక దూరం పాటించ‌కున్నా, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించినా భారీ జ‌రిమానాలు విధించాల‌ని కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories