హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం

Update: 2019-04-30 02:09 GMT

ఫణి పెను తుపాను ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఫణి.. ఆగ్నేయ బంగాళఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి 620 , చెన్నైకి 770, మచిలీపట్నానికి 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాన్ ఒడిశా దిశగా కదిలి అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మే 4న ఈ తుపాన్ ఒడిశా తీరం దాటి పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తుందని వెల్లడించారు.

అయితే ఫణి తుపాన్ 3,4 తేదీల్లో ఉత్తరాంధ్రకు చేరువగా పయనించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరెండురోజుల్లో భారీ వర్గాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడొచ్చని అంటున్నారు. తుఫాను హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీ సీఎస్ తుఫానుపై సమీక్ష నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు మత్సకారుల వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది.  

Similar News