రైల్వేశాఖకి షాక్ ఇస్తున్న ప్రయాణికులు...

Update: 2019-10-04 11:19 GMT

దసరా పండగను క్యాష్ చేసుకోవాలని చూసింది రైల్వే శాఖ.. అందులో భాగంగా రైల్వే ప్లాట్ ఫాం టికెట్ రేట్లను పెంచేసింది... పది రూపాయలు ఉన్నా ప్లాట్ ఫాం టికెట్ ధరను ఏకంగా ముప్పై రూపాయలకు పెంచేసింది. టికెట్ ధరల పెంపుపై రైల్వే అధికారులు వివరణ ఇస్తూ రద్దీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని, అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు.

కానీ ప్రయాణికులు మాత్రం ప్లాట్ ఫాం టికెట్ కు బదులుగా పాసింజర్ ట్రైన్ టికెట్ కొని రైల్వే శాఖకి రివర్స్ షాక్ ఇచ్చారు.. 30 రూపాయాలు పెట్టి ప్లాట్ ఫాం టికెట్ కొనడం కన్నా పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం బెటర్ అనుకున్నట్టు ఉన్నారు. ఎక్కువగా పాసింజర్ ట్రైన్ టికెట్స్ అమ్ముడుపోవడంతో అధికారులకు ఈ విషయం తెలిసింది. అంతే కాకుండా స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ దగ్గర ఉన్న పాసింజర్ టికెట్ ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు. పండుగ క్యాష్ చేసుకుందాం అనుకున్నా రైల్వేశాఖకి ప్రయాణికులు మేము ఎం తక్కువ కాదని ఉహించని షాక్ ఇస్తున్నారు.

Tags:    

Similar News