Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
Navjot Sidhu: సీఎం చరణ్‌జిత్‌పై పీసీసీ చీఫ్ సిద్ధూ ఫైర్
పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్ని పై మండిపడ్డ సిద్దు (ఫైల్ ఇమెజ్)
Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు తెరపడటం లేదు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కొత్త పథకాల ప్రకటనను సిద్ధూ తప్పుపట్టారు. రాష్ట్రంలో యూనిట్‌కు 3 రూపాయల చొప్పున విద్యుత్ రేట్ల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని ప్రకటించారు. అయితే సీఎం ప్రకటిస్తున్న పథకాలకు బడ్జెట్ కేటాయింపులు లేవని సిద్ధు దుయ్యబట్టారు. మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తప్పించి కొత్త సీఎంను తెరపైకి తెచ్చినా ఆయనతోనూ సిద్ధూకు పొసగకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తలపట్టుకుంటోంది.