త్వరలో స్వదేశీ విమానాలలో వై-ఫై కనెక్టివిటీ.. కానీ ఫోన్ అలా ఉంటేనే..

విమానంలో ప్రయాణీకులు వై-ఫై ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే అవకాశం రానే వచ్చింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

Update: 2020-03-02 08:06 GMT

విమానంలో ప్రయాణీకులు వై-ఫై ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే అవకాశం రానే వచ్చింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించింది.. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ప్రయాణికులు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, స్మార్ట్‌వాచ్, ఇ-రీడర్ ల తో ప్రయాణిస్తుంటారు. ఇకనుంచి విమానంలో ప్రయాణించేవారికి వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రయాణికులు తమ పరికరాలను ఫ్లైట్ మోడ్ లో ఉంచాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఇప్పటిదాకా దేశీయ విమానాలకు బోర్డులో వై-ఫై లేకపోవడం తోపాటు విదేశీ విమానయాన సంస్థలు కూడా భారతీయ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత వైఫై కనెక్టివిటీని నిలిపివేస్తారు. అయితే ఈ క్రమంలో విమానంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ప్రయాణికులు పలుమార్లు కోరారు. దీంతో బోర్డ్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంసిఎ) సేవలో ఇంటర్నెట్ మరియు మొబైల్ కమ్యూనికేషన్లను భారత గగనతలంలో ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ (ఐఎఫ్సి) గా అనుమతించాలని భారత టెలికాం రెగ్యులేటర్ 2018 లో సిఫారసు చేసింది. అందులో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అందులో వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది.


Tags:    

Similar News