Nina Kutina: రష్యా మహిళ కోసం ఇజ్రాయిల్ నుంచి వచ్చిన ప్రియుడు

Nina Kutina: ఇటీవల గోకర్ణ సమీప అడవుల్లో గుహలో రహస్యంగా ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న రష్యా మహిళను పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహిళను తాను ప్రేమించానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ ఒక వ్యక్తి ఇజ్రాయిల్ నుంచి వచ్చాడు.

Update: 2025-07-18 07:09 GMT

Nina Kutina: రష్యా మహిళ కోసం ఇజ్రాయిల్ నుంచి వచ్చిన ప్రియుడు

Nina Kutina: ఇటీవల గోకర్ణ సమీప అడవుల్లో గుహలో రహస్యంగా ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న రష్యా మహిళను పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహిళను తాను ప్రేమించానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటూ ఒక వ్యక్తి ఇజ్రాయిల్ నుంచి వచ్చాడు. ఆమెతో మాట్లాడేందుకు ఆ వ్యక్తి పోలీసుల సాయం కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే..

గోకర్ణ సమీపంలో ఎవరూ తిరుగుతున్నారనే సమాచారం రావడంతో చాలా పకగ్బందీగా ఇటీవల పోలీసులు అక్కడకు వెళ్లారు. అంతా గాలించిన తర్వాత ఒక గుహ దగ్గర బట్టలు కనిపించడం చూసి.. గుహలోపలికి వెళ్లి చూశారు. ఈ గుహలో ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఒక రష్యా మహిళ కనిపించింది. తీరా అక్కడ ఎందుకు ఉన్నావని ఆమెను అడిగితే.. అడవి జీవనం బావుంటుందని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గుహలో కనిపించిన రష్యా మహిళను, ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఆ తర్వాత హోమ్‌కి తరలించారు. వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు కూడా చేయించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్‌ నుంచి ఒక వ్యక్తి బెంగుళూరుకు వచ్చాడు. రష్యామహిళ తన ప్రియురాలు అని, ఇద్దరు ప్రేమించుకున్నామని.. ఇద్దరం కలిసి గోవాలో ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్లమని చెప్పాడు. అంతేకాదు, వారికి ఇద్దరు పిల్లలు, అని అయితే ఉద్యోగ రీత్యా ఇజ్రాయిల్ వెళ్లానని చెప్పాడు. కొన్నాళ్ల పాటు అక్కడ నుంచి ఫోన్ చేసేవాడినని, అయితే కొన్నాళ్ల క్రితం నుంచి ఆమె జాడ కనిపించడం లేదని చెప్పాడు. ఆమె కోసం కొంతడబ్బును కూడా ఆమె అకౌంట్‌లోకి పంపించానని కూడా ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.

అయితే ఆమెకు అడవి అంటే చాలా ఇష్టం అని, అడవి మధ్యలో పిల్లల్ని పెంచాలని తరచూ తనతో చెప్పేదని కూడా ఆ వ్యక్తి చెప్పడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రకృతి మధ్యలో పిల్లల్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆమె అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని అతను చెప్పాడు. ఇదిలాఉంటే ప్రకృతి మధ్యలో పిల్లల్ని పెంచాలనుకోవడం మంచిదే.దానికోసం అప్పుడప్పుడు అడవులకు తీసుకెళితే సరిపోయేది కదా.. ఇలా ఎవరికీ చెప్పకుండా.. ఎటువంటి ఆసరా లేకుండా అడవిలో జీవించడం ప్రాణాలకే ప్రమాదం కదా అంటూ పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News