Organic Water Bottles: సేంద్రీయ వాటర్ బాటిళ్లు రెడీ.. మార్కెట్లో అందుబాటులోకి

Organic Water Bottles: అన్ని పదార్థల్లో రసాయన కలుషిత ప్రభావం ఉండటం వాటివల్లే అధిక శాతం రోగాలు వస్తుండటంతో ప్రజలంతా సేంద్రీయ ఉత్పత్తులవైపు చూస్తున్నారు.

Update: 2020-07-16 04:00 GMT
Organic Water Bottles

Organic Water Bottles: అన్ని పదార్థల్లో రసాయన కలుషిత ప్రభావం ఉండటం వాటివల్లే అధిక శాతం రోగాలు వస్తుండటంతో ప్రజలంతా సేంద్రీయ ఉత్పత్తులవైపు చూస్తున్నారు. ఇదే మాదిరిగా ప్లాస్టిక్ వల్ల అధికశాతం అనర్ధాలు వస్తుండటం వల్ల ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారు. దీనిలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు స్టీల్, రాగి బాటిళ్లను ఇప్పటివరకు వాడుతున్నారు. తాజాగా త్రిపురలో సేంద్రీయ వాటర్ బాటిళ్లు ను వెదురుతో చేసి, మార్కెట్లోకి అమ్మకం చేస్తున్నారు.

సాదారణంగా వాటర్‌ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. ఇక కాపర్‌తో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ అవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మధ్య ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు అంతా ప్రత్యామ్నాయాల వైపు దృష్టిపెడుతున్నారు. ఇదే సమయంలో త్రిపురకు చెందిన బ్యాంబూ అండ్ క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆర్గానికి వాటర్ బాటిళ్లను తయారు చేసింది. వీటిని వెదురు కట్టెలతో తయారు చేస్తున్నారు.

అగర్తలలోని స్థానికులు వెదురుతో ఈ వాటర్‌ బాటిళ్లను తయారు చేసి.. ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు బాటిల్‌ బయట డిజైన్లను కూడా వేస్తున్నారు. ఈ విషయాన్ని బ్యాంబూ అండ్ క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఇంఛార్జ్ అవినభ్ కాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వెదురుతో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లకు భలే గిరాకీ ఉందని.. కస్టమర్లు వీటిని కొనేందుకు మక్కువ చూపుతున్నారన్నారు. ఇవి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ బాటిళ్లని తెలిపారు. అంతేకాదు.. వీటిని పూర్తిగా ఆర్గానిక్‌ పద్దతిలోనే రెడీ చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News