Kerala: కేరళలో భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్

Kerala: మిగతా జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ * పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Update: 2021-11-15 09:21 GMT

కేరళలో భారీ వర్షాల కారణంగా 6 జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Kerala: కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళలోని ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అకాల వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఇతర ప్రమాదాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. పశ్చిమ గాలుల్లో భాగంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

రానున్న గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడే, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా సమీపంలోని సహాయక శిబిరాలకు తరలించాల్సి ఉంటుందని సూచించారు. మరోవైపు కొల్లాం, కొట్టాయం, పతనంతిట్ట, ఎర్నాకులం, అలప్పుజలో ఇవాల విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అదేవిధంగా బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల వద్ద అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. రేపటికల్లా ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతానికి విస్తరిస్తుందని వెల్లడించింది. 17నాటికి వాయుగుండంగా మారి, 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణం కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News