PM Modi on Petrol Price Hike: లోక్‌స‌భ‌లో విప‌క్షాల ఆందోళ‌న‌

PM Modi on Petrol Price Hike: ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు * చమురు ధరల పెరుగుదలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్

Update: 2021-07-19 07:00 GMT

లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగం 

PM Modi on Petrol Price Hike: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. వారి ఆందోళ‌న మ‌ధ్యే ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించారు. కొత్త మంత్రుల‌ను ఆయ‌న ప‌రిచ‌యం చేస్తుండగా విపక్ష నేతలు నిరసనలతో హోరెత్తించారు. చమురు ధరల పెరుగుదలపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్ చేశారు. విపక్షాల నిరసనలతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు.

దేశానికి చెందిన ద‌ళితులు, మ‌హిళ‌లు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్ర‌తిప‌క్షాల‌కు సంతోషంగా లేద‌ని ఆయ‌న అన్నారు. పార్ల‌మెంట్‌లో ఉత్సాహ వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని అనుకున్నాన‌ని, కొత్త మ‌హిళా, ద‌ళిత ఎంపీల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎంపీల‌ను పరిచ‌యం చేయాల‌నుకున్నాని, కానీ కొంద‌రికి మాత్రం ద‌ళిత ఎంపీలు మంత్రులు కావ‌డం న‌చ్చ‌డం లేద‌ని ఆరోపించారు.

Tags:    

Similar News