Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్’ కలకలం: పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు హతం?

Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్‌కు సమీపంలోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ వద్ద సోమవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ‘ఆపరేషన్‌ మహదేవ్‌’ పేరిట జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు చినార్‌ కోర్‌ వెల్లడించింది.

Update: 2025-07-28 08:40 GMT

అయితే, ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఏప్రిల్‌ 22న పహల్గాం బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన వారేనా అనే విషయమై అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ విషయంపై చినార్‌ కోర్‌ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మృతిచెందినవారు లష్కరే తయిబా సంబంధిత విదేశీ ఉగ్రవాదులుగా ఉన్నట్టు సమాచారం.

ఒక్క నెలకు పైగా గాలింపు.. చివరకు ఎదురుకాల్పులు

హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్టు నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు గత నెలరోజులుగా ముమ్మర గాలింపు చేపట్టాయి. చివరకు సోమవారం ఉదయం దాచిగమ్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులెదురుగా వస్తుండగా వారు కాల్పులు ప్రారంభించారు. వెంటనే బలగాలు ప్రతికార చర్యగా ఎదురుకాల్పులు జరిపాయి. ఆ సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

పహల్గాం దాడిపై మరింత స్పష్టత రానుంది

పహల్గాం బైసరన్‌లో జరిగిన దాడిలో 25 మంది పర్యాటకులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన విషాదం చెలరేగింది. ఈ దాడికి లష్కరే తయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ బాధ్యత వహించినట్టు అప్పట్లో భద్రతా వర్గాలు వెల్లడించాయి. దాడికి పాల్పడిన వారిలో ఒక్కొక్కరి తలపై రూ. 20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం దాచిగమ్‌లో హతమైన ఉగ్రవాదుల వివరాలు, పహల్గాం దాడితో ఉన్న సంబంధం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రాంతం లో ఘర్షణ వాతావరణం.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం మొత్తం భద్రతా బలగాలు ముట్టడి విధించి సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. ఘటనాస్థలిలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మృతదేహాలను పరిశీలిస్తున్నాయి. పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News