తిరిగివచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీతో టచ్ లో ఉన్న మరో నలుగురు
మధ్య ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు కొందరు తిరిగి వచ్చారు. ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ శిబిరంలోనే ఉన్నారు.
మధ్య ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు కొందరు తిరిగి వచ్చారు. ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ శిబిరంలోనే ఉన్నారు. వారిని దారికి తెచ్చేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపీ శిభిరంలో చేరిపోయారంటూ.. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పట్వారి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత కాంగ్రెస్ శాసనసభ్యులతో సహా 10 మంది ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని లగ్జరీ హోటల్‌కు బిజెపి తరలించినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
బిజెపి సీనియర్ నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) శాసనసభ్యుడిని చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని దిగ్విజయ సింగ్ పేర్కొన్నారు. అయితే అలా వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లోకి వచ్చారు. మరో నలుగురు మాత్రం బీజేపీ శిభిరంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని, వారు తిరిగి వచ్చేలా విశ్వాసాన్ని చూపించారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకులు జితు పట్వారీ, జైవర్ధన్ సింగ్ గుర్గురామ్‌లోని ఐటిసి హోటల్ కు చేరుకున్నారు. వారు సస్పెండ్ అయిన బిఎస్పి ఎమ్మెల్యే రమాబాయి పరిహార్ తో చర్చలు జరిపారు. ఆమె తిరిగి కాంగ్రెస్ తో ఉండటానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెను పార్టీ చీఫ్ మాయావతి డిసెంబర్‌లోనే సస్పెండ్ చేశారు. తాజా పరిణామాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు.. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
అంతేకాదు తమ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని కమల్ నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కమల్ నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి 230 మంది శాసనసభ్యుల్లో 121 మంది సభ్యుల మద్దతు ఉంది. 230 లో కాంగ్రెస్ బలం 114 కాగా, బిజెపికి 107 ఉన్నాయి. మిగిలిన తొమ్మిదింటిలో ఇద్దరు బిఎస్పితో, ఒకరు ఎస్పీతో ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజా పరిణామాలు కాంగ్రెస్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు.. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని అగ్రనేతలు టెన్షన్ పడుతున్నారు.