స్కూటర్ రూ.65 వేలు , జరిమానా లక్ష!

కేంద్రప్రభుత్వం కొత్తగా అమలు చేసిన మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూటరు ఖరీదు కంటే భారీగా జరిమానా విధించింన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Update: 2019-09-21 10:00 GMT

కేంద్రప్రభుత్వం కొత్తగా అమలు చేసిన మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చలానాలు వేయడంతో రోజుకు కొన్ని వేల రూపాయులు చలానాల రూపంలో వసూలవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూటరు ఖరీదు కంటే భారీగా జరిమానా విధించింన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. హోండా యాక్టివాను ట్రాఫిక్ పోలీసులు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు. భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఇంతేకాకుండా భువనేశ్వర్ ఆర్టీవో అధికారులు ఆ డీలర్‌షిప్ నకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామన్నారు. అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేశారని డీలర్‌ను ప్రశ్నించారు. 

Tags:    

Similar News