Odisha: కాల్పుల ఘటనలో ఒడిశా ఆరోగ్య మంత్రి మృతి

Odisha: ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో మంత్రికి తీవ్ర గాయాలు

Update: 2023-01-30 00:55 GMT

Odisha: కాల్పుల ఘటనలో ఒడిశా ఆరోగ్య మంత్రి మృతి 

Odisha: ఒడిశాలో సంచలనం రేపిన మంత్రిపై కాల్పుల ఘటనలో ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్‌ భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మంత్రిపై ASI గోపాల్‌ దాస్ కాల్పులు జరపడంతో తీవ్రగాయాలపై మంత్రి కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో పరిస్థితి విషమించింది. ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో మంత్రిపై ఈ దాడి జరిగింది. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌ నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్దకు చేరుకున్న ASI గోపాల్‌దాస్‌..మంత్రి వాహనం దిగుతున్న సమయంలో కాల్పులు జరిపి పరార్ అయ్యాడు. ఆ తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బలగాలు గాలించగా చివరకు ఓ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. ఉదయం భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరామర్శించారు. జరిగిన దాడిని సీఎం తీవ్రంగా ఖండించారు.

Tags:    

Similar News