Viral News: నాగలికి కట్టి, పొలం దున్నించి.. ప్రేమ వివాహం చేసుకున్నారని దారుణం!
Viral News: ఒడిశాలో ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై అమానవీయ ఘటనలు ఆగడం లేదు.
Viral News: నాగలికి కట్టి, పొలం దున్నించి.. ప్రేమ వివాహం చేసుకున్నారని దారుణం!
Viral News: ఒడిశాలో ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై అమానవీయ ఘటనలు ఆగడం లేదు. ఇటీవల రాయగడ జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే, తాజాగా కోరాపుట్ జిల్లా నారాయణ పట్టణం సమితి పరిధిలోని బైరాగి పంచాయతీలో మరో దారుణం వెలుగుచూసింది.
పెద్దఇటికీ గ్రామానికి చెందిన యువకుడు, యువతి (వరుసకు అన్నాచెల్లెలు) పరస్పరం ప్రేమించి, ఐదేళ్ల క్రితం గ్రామం విడిచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు వారిని గ్రామానికి పిలిపించి, అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే గ్రామ పెద్దలు, ఒకే వంశంలో వివాహం చేయడం ఆచార విరుద్ధమని అభ్యంతరం తెలిపారు.
దీంతో, గ్రామ శిక్షగా జంటను నాగలికి ఎద్దుల్లా కట్టి, పొలం దున్నింపజేశారు. అనంతరం శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దల నిర్ణయంతో ఈ హింసాకాండ చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై అధికారులు స్పందిస్తూ, గ్రామానికి వెళ్లి విచారణ చేపడతామని వెల్లడించారు.