Free Transport for JEE Candidates: జేఈఈ అభ్యర్థులకు ఉచిత రవాణా.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయం..

FreeTransport for JEE Candidates: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) లో హాజరయ్యే అభ్యర్థులకు సెప్టెంబర్ మొదటి వారంలో ఉచిత రవాణా, వసతి కల్పిస్తామని ఒడిశా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Update: 2020-08-29 05:22 GMT

FreeTransport for JEE Candidates: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) లో హాజరయ్యే అభ్యర్థులకు సెప్టెంబర్ మొదటి వారంలో ఉచిత రవాణా, వసతి కల్పిస్తామని ఒడిశా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన కార్యదర్శి ఎకె త్రిపాఠి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు, వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జేఈఈ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత రవాణా, వసతి కల్పిస్తుంది అని తెలిపారు. భువనేశ్వర్, కటక్ సహా ఏడు వేర్వేరు పట్టణాల్లో ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో 37,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

జేఈఈ పరీక్ష సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జరగనున్నాయి. జిల్లా అధికారులు, పోలీసు, ఇతర సిబ్బంది అభ్యర్థుల కదలికలు, వారి సంరక్షన, రవాణా, బసను సులభతరం చేసే విదంగా రవాణా అధికారులను ఆదేశించారు. ఆగస్టు 31 లోగా నోడల్ ఐటిఐ ప్రిన్సిపాల్స్‌తో వివరాలను పంచుకోవాలని జేఈఈ ఆశావాదులను కోరారు, తద్వారా వారి రవాణా మరియు వసతి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయవచ్చు అని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విదించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. జేఈఈ అభ్యర్థులు వారి అడ్మిట్ కార్డులను చూపించగలరు, అది వారి కదలికకు పాస్లుగా పరిగణించబడుతుంది అని.. ఇది కాకుండా, ప్రభుత్వం బస్సులను కూడా అందిస్తుంది అభ్యర్థులను వివిధ ఐటిఐలు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంచుతుంది అని తెలిపారు. అయితే, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వారి షెడ్యూల్ ప్రయాణం గురించి ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలి అని ఆయన అన్నారు.

ప్రతి జిల్లాలో ఒక ఐటిఐ (పారిశ్రామిక శిక్షణా సంస్థల) ప్రిన్సిపాల్‌ను నోడల్ ఆఫీసర్‌గా ఎంపిక చేసినట్లు నైపుణ్య అభివృద్ధి కార్యదర్శి సంజయ్ సింగ్ తెలిపారు. జేఈఈ ప్రయోజనం కోసం రవాణా, వసతి సౌకర్యాలు పొందటానికి విద్యార్థులు సంప్రదించగలరు అని.. అంతే కాదు నీట్ పరీక్షలో హాజరయ్యే విద్యార్థులకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని సింగ్ తెలిపారు. 

Tags:    

Similar News