Odisha Couple: కాడెద్దులుగా చేసి, కర్రలతో కొట్టి.. ప్రేమికులను పొలం దున్నించిన ఊరిజనం
Odisha Couple: ఏఐతో ప్రపంచం ఆధునికంగా ఎంతో దూసుకుపోతుంటే.. మూడ నమ్మకాలు, పట్టింపుల పేరుతో ఇంకా కొందరు ఈ సమాజంలో ఉండిపోయారు.
Odisha Couple: కాడెద్దులుగా చేసి, కర్రలతో కొట్టి.. ప్రేమికులను పొలం దున్నించిన ఊరిజనం
Odisha Couple: ఏఐతో ప్రపంచం ఆధునికంగా ఎంతో దూసుకుపోతుంటే.. మూడ నమ్మకాలు, పట్టింపుల పేరుతో ఇంకా కొందరు ఈ సమాజంలో ఉండిపోయారు. ఇలాంటి సంఘటనే ఇటీవల ఒడిస్సాలో జరిగింది. తన బంధువుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఇద్దరిని కాడెద్దులా చేసి, కర్రలో కొట్టి, పొలం దున్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
కులాంతర వివాహం చేసుకున్నారని, సంప్రదాయలకు విరుద్దంగా పెళ్లి చేసుకున్నారని గుండు గీయించడం, బట్టలు విప్పించి కొట్టడం, పరువు హత్యలకు పాల్బడం.. ఇవన్నీ ఇంకా ఈ దేశంలో ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఇటీవల ఒడిసాలో జరిగింది.
పోలీసుల చెప్పిన దాని ప్రకారం, ఒడిసాలోని కంజామఝిరా గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన తన బంధువుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వరసలు వేరు కావడంతో వీరి పెళ్లిని కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. ఊరి సంప్రదాయాలకు కట్టుబాట్లకు వ్యతిరేకంగా వీరిద్దరూ వ్యవహరించారని, చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ జంటను నాగలికి కాడెద్దులుగా చేశారు. వారిని కర్రలతో కొడుతూ.. ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు.
అంతటితో ఆగలేదు... పొలంలో దున్నించిన తర్వాత వారిని ఊరిలో ఉన్న ఒక దేవాలయానికి తీసుకెళ్లి శుద్ది కర్మల పేరుతో భయానకమైన పూజలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేసును నమోదు చేసి పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోని కూడా తాము పరిగణంలోనికి తీసుకున్నామని అన్నారు.