NEET Admit Card 2025: నీట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసింది... హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

NTA releases NEET Admit Card 2025: నీట్ యూజీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి లాగిన్ అవడం ద్వారా తమ వివరాలను సబ్‌మిట్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Update: 2025-04-30 15:27 GMT

NTA releases NEET Admit Card 2025: నీట్ యూజీ హాల్ టికెట్స్ వచ్చేశాయ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ హాల్ టికెట్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ యూజీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి లాగిన్ అవడం ద్వారా తమ వివరాలను సబ్‌మిట్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NEET 2025 Admit Card ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే...

Step 1. నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లాగాన్ చేయండి.

Step 2. "NEET UG 2025 Admit Card" అనే లింకుపై క్లిక్ చేయండి.

Step 3. మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి, పుట్టిన తేదీ, అక్కడ కింద చూపించే సెక్యురిటీ కోడ్ ఎంటర్ చేయండి.

Step 4. డీటేల్స్ సబ్‌మిట్ చేసిన తరువాత వ్యూ లేదా డౌన్‌లోడ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ లింకుపై క్లిక్ చేయండి.

Step 5. హాల్ టికెట్ కాపీ సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ అయిన: NEET UG Admit Card 2025

నీట్ యూజీ పరీక్షల తేదీ - మే 5

పరీక్ష కాల వ్యవధి - 3 గంటలు

మీడియం- హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషలు కలిపి మొత్తం 13 భాషల్లో పరీక్ష పేపర్ అందుబాటులో ఉంటుంది.

అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 011-40759000 / 011-69227700, Email: neetug2025@nta.ac.in పై సంప్రదించవచ్చు. 

Tags:    

Similar News