కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా

Update: 2019-09-26 11:39 GMT

కర్ణాటకలో జరగాల్సి ఉన్న ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నికలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కేంద్రం ఎన్నికల సంఘం అంగీకారం తెలిపింది.

కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ సమయంలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇటీవల ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఆయా పిటిషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి వచారణను అక్టోబర్‌ 22 కు వాయిదా వేసింది. 

Tags:    

Similar News