వ్యవసాయంతో కోట్లు సంపాదిస్తున్న టాప్ 10 భారతీయులు

వ్యవసాయంలో ఎలాంటి లాభాలు లేవని చెబుతుంటారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో పాటు సాంప్రదాయ వ్యవసాయాన్ని అత్యంత లాభదాయకంగా మార్చుకున్నారు కొందరు రైతులు.

Update: 2025-02-27 08:04 GMT

వ్యవసాయంతో కోట్లు సంపాదిస్తున్న టాప్ 10 భారతీయులు

వ్యవసాయంలో ఎలాంటి లాభాలు లేవని చెబుతుంటారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో పాటు సాంప్రదాయ వ్యవసాయాన్ని అత్యంత లాభదాయకంగా మార్చుకున్నారు కొందరు రైతులు. ఇతర వ్యాపారాల మాదిరిగానే వ్యవసాయం ద్వారా ప్రతి ఏటా కోట్లు సంపాదిస్తున్నారు. ఒక మహిళా రైతు ఏటా 100 కోట్లు సంపాదిస్తున్నారు. దేశంలో టాప్ 10 మంది లక్షలు సంపాదించే రైతుల గురించి తెలుసుకుందాం. 2024లో టాప్ 10 మంది రైతుల జాబితాలోకి వీళ్లు ఎలా చేరారు? దీని వెనుక ఉన్న కృషి ఏంటి? ఈ స్థాయికి చేరుకోవడానికి వచ్చిన అడ్డంకులను ఎలా దాటారో చూద్దాం.

1. నితుబెన్ పటేల్

గుజరాత్ రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన నితుబెన్ పటేల్ 2024 మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును దక్కించుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి మహిళా కూడా ఆమె.అమృత్ క్రుషి, మాజికల్ మిట్టి ఆమె సమకాలీన వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టారు.

సజీవన్ ఫౌండేషన్, సజీవన్ లైఫ్‌ని కూడా ఆమె స్థాపించారు.ప్లాస్టిక్ తగ్గించేందుకు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాటన్ బ్యాగులను ఆమె అందిస్తున్నారు.ప్రతి ఏటా మొక్కల పెంపకం చేపడుతారు. పురుగు మందులు లేని సేంద్రీయ వ్యవసాయ గురించి రైతులకు ఆమె అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆమె ప్రతి ఏటా 100 కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారు.

2.యువరాజ్ పరిహార్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన యువరాజ్ పరిహార్ 2024లో దేశంలో టాప్ 2 రైతుగా నిలిచారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్దతులు పాటిస్తారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు. పరిహార్ పాటించే వ్యవసాయ పద్దతులపై ప్రపంచంలోని పలు దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి. అంతర్జాతీయ బంగాళాదుంప సదస్సు 2020లో ఉత్తమ బంగాళాదుంప రైతు అవార్డు ఆయనకు దక్కింది. వ్యవసాయంలోకి వచ్చే యువ రైతులను ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఆయన వార్షిక ఆదాయం 50 కోట్లు.

3. హరీష్ ధన్ దేవ్

ఇంజనీరింగ్ వృత్తిని వదిలి హరీ్ ధన్ దేవ్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారు.ధన్ దేవ్ కలబంద సాగు చేస్తారు. 100 ఎకరాల్లో కలబంద పంట వేశారు. కలబంద ఆధారి ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. అంతేకాదు కలబంద ప్రాసెసింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఆయన ప్రతి ఏటా 2.5 కోట్లు సంపాదిస్తున్నారు.

4. గీనాభాయ్ పటేల్

గీనాభాయ్ పటేల్ దానిమ్మ పండ్లను పండించడంలో పేరొందారు. వైకల్యం ఉన్నప్పటికీ గీనాభాయ్ పటేల్ దానిమ్మ సాగులో వెనుకడుగు వేయలేదు. వ్యవసాయంలో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. గుజరాత్ లోని పలు జిల్లాల్లో దానిమ్మ సాగు చేసేలా గీనాభాయ్ పటేల్ ప్రోత్సహిస్తున్నారు. బిందు సేద్యం ద్వారా దానిమ్మ సాగు చేస్తున్నారు.గీనాభాయ్ పటేల్ సాగు విధానాన్ని 70 వేల మంది రైతులు పరిశీలించారు. ఆయన వార్షిక టర్నోవర్ రెండు కోట్లు.

5.సచిన్ కాలే

కార్పోరేట్ పదవిని వదులుకొని అగ్రిలైఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సచిన్ కాలే ప్రారంభించారు. సమకాలీన వ్యవసాయ పద్దతులకు టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తున్నారు. 200 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. ఆయన వార్షిక టర్నోవర్ 2 కోట్లు.

6.రామ్ శరణ్ వర్మ

ఐదు ఎకరాల్లో ప్రారంభించిన వ్యవసాయాన్ని 200 ఎకరాలకు విస్తరించారు రామ్ శరణ్ వర్మ. అరటిపండ్లు, టమాటా, బంగాళాదుంపలు పండిస్తారు. సేద్యం ద్వారా లక్షలు సంపాదించవచ్చని వర్మ నిరూపించారు. 2019లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆయన వార్షిక టర్నోవర్ 2 కోట్లకు పైగానే ఉంటుంది.

7. రమేశ్ చౌదరి

రాజస్థాన్ కు చెందిన రమేశ్ చౌదరి అనే రైతు ప్రతి ఏటా రెండు కోట్లు సంపాదిస్తున్నారు. జైపూర్ లో మూడు ప్లే హౌస్ , గ్రీన్ హౌస్ లు నిర్వహిస్తున్నారు. టమాటా, దోసకాయలతో పాటు పూలను కూడా ఆయన పండిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను ఆయన పాటిస్తున్నారు.

8. విశ్వనాథ్ బోబ్డే

ఎకరం భూమి నుంచి ప్రతి ఏటా 1.75 కోట్లు సంపాదిస్తున్నారు మహారాష్ట్రకు చెందిన రైతు విశ్వనాథ్ బోబ్డే. మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతైన బీడ్ ప్రాంతానికి చెందిన వారు బోబ్డే.

9.ప్రమోద్ గౌతమ్

ఆటోమొబైల్ ఇంజనీర్ ప్రమోద్ గౌతం వ్యవసాయం ద్వారా ప్రతి ఏటా 1 కోటి సంపాదిస్తున్నారు. పూర్వీకుల ఇంటి స్థలంలో ఆయన వ్యవసాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయం చేయడానికి ముందు ఆయన ఆటోమొబైల్ ఇంజనీర్ గా పనిచేశారు. మొక్కజొన్న, ఆవాలు, గోధుమ పండిస్తున్నారు.

10. రాజీవ్ బిట్టు

రాంచీ సమీపంలోని కుచు గ్రామంలో భూమిని లీజుకు తీసుకుని రాజీవ్ బిట్టు వ్యవసాయం చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. 32 ఎకరాల్లో పంటలు పండిస్తూ ప్రతి ఏటా 15 నుంచి 16 లక్షలు సంపాదిస్తున్నారు.

Tags:    

Similar News