Nirmala Sitharaman: రికార్డ్‌.. ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌

Nirmala Sitharaman: ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మన్మోహన్‌, జైట్లీ,.. చిదంబరం, యశ్వంత్‌సిన్హాల రికార్డును అధిగమించిన నిర్మల

Update: 2024-02-01 06:25 GMT

Nirmala Sitharaman: రికార్డ్‌.. ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.. 2024-25 తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉదయం నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఆరోసారి కావడం విశేషం. 2019లో NDA ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అప్పటి నుంచి 2023 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి బడ్జెట్‌తో ఆరోసారి ప్రవేశపెట్టారు.. ఇప్పటికే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలమ్మ రికార్డు సృష్టించారు.

నిర్మలాసీతారామన్‌ ఇప్పుడు వరుసగా ఆరోసారి పద్దుతో.. మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ను సమం చేయనున్నారు. ఆయన 1959-64 సమయంలో ఐదు రెగ్యులర్ బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం విశేషం. నిర్మలమ్మ ఇదే సమయంలో.. గత ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీలను అధిగమించనున్నారు. వీరు 5 సార్లు బడ్జెట్ వరుసగా ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News