Nirbhaya Case: పవన్ పిటిషన్ కొట్టివేత.. రేపు ఉరి లాంఛనమేనా?

సుప్రీం కోర్టులో నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తాకు షాక్ తగిలింది. ఉరిశిక్షను జీవిత ఖైదు గా మార్చాలని అతను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

Update: 2020-03-02 06:04 GMT

సుప్రీం కోర్టులో నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తాకు షాక్ తగిలింది. ఉరిశిక్షను జీవిత ఖైదు గా మార్చాలని అతను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్, ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించి కొట్టేసింది. అయితే అతను రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఒక్కటే ఉంది. చివరిసారిగా హాజరైన పాఠశాల రికార్డుల ప్రకారం.. 2012 లో నేరం జరిగిన రోజున తన వయస్సు 16 సంవత్సరాల రెండు నెలలు అని పవన్ గుప్తా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను కోర్ట్ కొట్టివేయడంతో నిర్భయ కేసులోని నలుగురు నిందితులు న్యాయవకాశాలను వినియోగించుకున్నట్టు అయింది.

గతంలో మిగిలిన ముగ్గురు నిందితులు పలు రకాల న్యాయావకాశాలను వినియోగించుకున్నారు. తాజాగా పవన్ కుమార్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసి అతను కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. క్షమాబిక్ష పెట్టమని రాష్ట్రపతిని వేసుకునే అవకాశం ఉందని.. అలా కానీ పక్షంలో ఇక ఉరి లాంఛనమే అని కొందరు లాయర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న ఉదయం నలుగురు నిందితులను ఒకేసారి చనిపోయేంతవరకు ఉరి తీయనున్నారు.

ఇదిలావుంటే దోషులలో ఒకరైన అక్షయ్ ఠాకూర్ ఫిబ్రవరి 29 న రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టమని వేడుకున్నారు. గతంలో ముఖేష్, వినయ్ మరియు అక్షయ్ అనే ముగ్గురు దోషుల క్షమాబిక్ష పిటిషన్లను అప్పటికే రాష్ట్రపతి కొట్టివేసారు. దీనిపై కూడా ఇవాళ సాయంత్రం లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 16 డిసెంబర్ 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. నిర్భయ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు విచారణ సాగింది. 

Tags:    

Similar News