మరోసారి నిర్భయ నిందితుల ఉరి అమలు వాయిదా పడింది. డెత్ వారెంట్ పై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై ఈ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. ఇదిలావుంటే పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. అంతకుముందు పవన్ నివారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన అభ్యర్థించారు. దీనికి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్షను పునఃపరిశీలించే ప్రశ్న లేదని పిటిషన్ ను కొట్టివేశారు.