Lightning Strikes: బీభత్సం సృష్టిస్తున్న అకాల వర్షాలు..పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం
Lightning Strikes: బీభత్సం సృష్టిస్తున్న అకాల వర్షాలు..పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం
Lightning Strikes: దేశవ్యాప్తంగా అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులే కాదు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశాలో వర్ష బీభత్సం స్రుష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. పిడుగుపాటుకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆరుగురు మహిళలు సహా కనిసం 9 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కోరాపుట్ జిల్లాలో ముగ్గురు, జాజ్ పూర్, గంజాం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, దెంకనల్, గజపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు చెప్పారు. కోరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిడిగూడ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మరణించినట్లు అధికారులు తెలిపారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ప్రజలు గాయపడినట్లు వారు వెల్లడించారు.