Rameshwaram Blast: రామేశ్వరం పేలుడు కేసులో NIA కీలక ప్రకటన

Rameshwaram Blast: అనుమానితుల వివరాలు వెల్లడించిన NIA

Update: 2024-03-09 16:00 GMT

Rameshwaram Blast: రామేశ్వరం పేలుడు కేసులో NIA కీలక ప్రకటన 

Rameshwaram Blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ అడ్రస్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది.

ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్‌, భట్కల్‌.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్‌ఐఏ ప్రజల్ని కోరుతోంది.

పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్‌ కేసులోకి యాంటీ-టెర్రర్‌ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్‌ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్‌ను సైతం ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్‌ఐఏ. 

Tags:    

Similar News