Honeymoon couple missing: హనీమూన్ వెళ్లిన కొత్త జంట మిస్సింగ్..ఏమైందో తెలియక టెన్షన్..!!
Honeymoon couple missing: హనీమూన్ వెళ్లిన కొత్త జంట మిస్సింగ్..ఏమైందో తెలియక టెన్షన్..!!
Honeymoon couple missing: హనీమూన్ కోసం వెళ్లిన ఓ కొత్త జంట మిస్స్ అయ్యింది. మిస్సింగ్ అయిన వారిలో భర్త రాజా రఘువంశీ భార్య పేరు సోనమ్. రాజా రఘువంశీ ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారవేత్త. దీంతో మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. మేఘాలయాలోని షిల్లాంగ్ లో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ ఇండోర్ చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్ తో ఇటీవల మే 11వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మే 20న హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ వారు గడుపుతున్నారు. కుటుంబసభ్యులతో మే 25వ తేదీ వరకు కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ అవ్వడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో కొందరు ఫ్యామిలీ మెంబర్స్ షిల్లాంగ్ వెళ్లారు.
అక్కడ కొత్త జంట ఫొటోల ద్వారా సోనమ్ సోదరుడు గోవింద్ వారిని వెతికాడు. ఓస్రా హిల్స్ లో యాక్టివాను అద్దెకు తీసుకున్నారని గుర్తించాడు. అప్పుడు గోవింద్ రాజా సోదరుడు విపిన్ కలిపి వెతకడానికి ఓస్రా హిల్స్ కు వెళ్లగా అక్కడ యాక్టివా కనిపించింది. కానీ ఆ జంట ఆచూకీ మాత్రం దొరకలేదు. వారి నుంచి దుండగులు దోచుకున్నాని..అదే ప్రదేశంలో భారీ లోయ ఉండటం వల్ల కుటుంబ సభ్యులు అనుమానపడ్ారు. వెంటనే ఇండోర్ పోలీసులకు సమాచారం అందించారు. మేఘాలయ ప్రభుత్వంతో మాట్లాడాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కోరారు.
మేఘాలయ సీఎం సంగ్మాతో ఆ విషయం గురించి ఫోనులో చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. ఆ తర్వాత నూతన జంట ఆచూకీ తెలుకునేందుకు పోలీసు విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సీఎం సంగ్మా తెలిపారు. ఆ జంట సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.