Kerala: కేరళలో కొత్త వేరియంట్ల దడ..బెంగళూరులో కరోనా థర్డ్‌వేవ్‌..?

Kerala: రెండు డోసులు తీసుకున్నవారికి పాజిటివ్ * 40వేలకు పైగా కేసులు నమోదు

Update: 2021-08-12 08:49 GMT

కేరళలో కొత్త వేరియంట్ ల దడ (ఫైల్ ఇమేజ్)

Kerala: కేరళ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతోంది. రాష్ట్రంలో కొత్త వేరియంట్లు దడ పుట్టిస్తున్నాయి. కోవిడ్‌ టీకా తీసుకున్నవారిని సైతం వైరస్‌ వదిలిపెట్టడం లేదు. రెండు డోసులు తీసుకున్న 40వేల మందికిపైగా ప్రజలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రెండు డోసులు తీసుకున్నవారికి కరోనా సోకినటువంటి కేసులు దాదాపు లక్ష నమోదవగా.. వాటిలో 40వేలు ఒక్క కేరళలోనే గుర్తించారు. దీంతో.. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం ఆ 40వేల మంది కొవిడ్‌ శాంపిళ్లను సేకరించి, ల్యాబ్‌కు పంపాలని యోచిస్తోంది. నివేదిక ఆధారంగా అసలు కేరళలో వైరస్ ఉధృతికి కారణమేంటనేదానిపై స్పష్టత రానుంది.

మరోవైపు.. బెంగళూరులో కరోనా థర్డ్‌వేవ్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల్లో దాదాపు 242 మంది పిల్లలు కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్య నిపుణులు హెచ్చరించినట్టే థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇక గత 24 గంటల్లో కర్ణాటకలో 13వేల 38 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 

Tags:    

Similar News