రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తరువాత నా భార్య కనిపించడం లేదు.. మార్చురిలో కూడా వెతికాను..

Woman goes missing after New Delhi Railway Station Stampede: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తరువాత మహిళ మిస్సింగ్... ఆమెతో పాటు మరో నలుగురైదుగురు

Update: 2025-02-16 08:59 GMT

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తరువాత నా భార్య కనిపించడం లేదు.. మార్చురిలో కూడా వెతికాను.. మీడియాతో అదృశ్యమైన మహిళ భర్త

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. మరో డజెన్‌కు పైగా మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటన తరువాత ఇంకొంతమంది ఆచూకీ కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన వారి కోసం వారి కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. తన భార్య మీనా దేవి కనిపించడం లేదని ఆమె భర్త భోలాస మీడియాకు తెలిపారు. మహా కుంభ మేళాలో పాల్గొనేందుకని ప్రయాగ్ రాజ్ ట్రెయిన్ కోసమే మీనాదేవి కూడా ఇక్కడికొచ్చినట్లు బీహార్‌కు చెందిన భోలాస చెప్పారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ (LNJP Hospital) కు తరలించారు. చనిపోయిన వారికి పోస్ట్ మార్టం కూడా ఇదే ఆస్పత్రిలో నిర్వహించారు. దీంతో తన భార్య మీనాదేవిని వెతుక్కుంటూ ఆమె భర్త అక్కడికి వెళ్లారు. ఆస్పత్రి అంతా కలియతిరిగినా అమె కనిపించ లేదు. "ఆఖరికి మార్చురీ గది వద్దకు కూడా వెళ్లి చెక్ చేశాను. పోస్ట్ మార్టం చేసిన శవాలను కూడా వారి కుటుంబసభ్యులకు అప్పగించామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. మరి నా భార్య మీనాదేవి ఏమైంది" అని మీనాదేవి భర్త ఆందోళన వ్యక్తంచేశారు.

"మీనాదేవితో పాటు మరో నలుగురైదుగురు తోటి ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. అందరూ కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కానీ ఇప్పుడు ఎవ్వరి ఫోన్ కలవడం లేదు" అని భోలాస చెప్పారు. 

Tags:    

Similar News