Coronavirus in India: దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో కరోనా కలకలం

Coronavirus in India: రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసులు

Update: 2022-04-15 04:15 GMT

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో కరోనా కలకలం

Coronavirus in India: కొవిడ్‌ కథ ముగిసిపోయిందనుకుంటున్న దశలో ఢిల్లీ, ముంబై నగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో మార్చి 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక, దేశవ్యాప్తంగా 2 వారాలుగా రోజూ సగటున వెయ్యి కేసులు రికార్డవుతున్నాయి. ఒమైక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అయిన బీఏ2, ఎక్స్‌ఈ వేరియంట్ల వల్ల ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై నగరాల్లో కనిపిస్తున్న స్వల్ప పెరుగుదల కలకలం సృష్టిస్తోంది.

యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2,9 శాతానికి పెరిగింది. అయితే ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసులపై సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామనిఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక యూపీలోని నోయిడాలో 23 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే స్కూళ్లను అధికారులు మూసి వేయించారు. ఆన్‌లైన్ తరగతులకు ఆదేశించారు. నోయిడాలోని మొత్తం 4 స్కూళ్లలో 23 మంది విద్యార్థులకు కరోనా సోకిందని వైద్యాధికారి తెలిపారు. ఒక్క కైతాన్ పబ్లిక్ స్కూల్‌లోనే 13 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడినట్టు స్పష్టం చేశారు. విద్యార్థుల కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేస్తున్నామని.. మరింత మంది విద్యార్థులకు వైరస్‌ సోకి ఉండవచ్చని వైద్యాధికారి తెలిపారు., ప్రస్తుతం కేవలం లక్షణాలు ఉన్నవారిని మాత్రమే టెస్ట్‌ చేస్తున్నట్టు డాక్టర్‌ తెలిపారు.

కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈని ముంబై, గుజరాత్‌లో గుర్తించారు. ముగ్గురికి ఈ వైరస్‌ సోకినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఎక్స్‌ఈ వేరియంట్‌ ఆధారాలు వారిలో లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెరుగుతున్న కేసులతో, కొత్త్ వేరియంట్‌తో మళ్లీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ వైరస్‌ వ్యాపిస్తుందని, ఫోర్త్‌ వేవ్‌ వస్తుందేమోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యి 88 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 10వేలకు పడిపోయాయి.

Tags:    

Similar News