NEET 2021: రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష

NEET 2021: దేశవ్యాప్తంగా 3,842 పరీక్షా కేంద్రాల ఏర్పాటు * దరఖాస్తు చేసుకున్న 16లక్షల మంది విద్యార్థులు

Update: 2021-09-11 13:15 GMT

దేశ వ్యాప్తంగా రేపు నీట్ పరీక్ష(ఫోటో ది హన్స్ ఇండియా )

NEET 2021: నీట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 202 పట్టణాల్లో 3వేల 842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా తెలంగాణలోని 7 పట్టణాల్లో 112 కేంద్రాలు, ఏపీలోని 9 పట్టణాల్లో 151 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నీట్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

మరోవైపు మ‌ధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల త‌ర్వాత నిమిషం ఆల‌స్యమైనా అనుమ‌తించేది లేదని ఎన్టీఏ అధికారులు తెలిపారు. పెన్ను, పేప‌ర్ విధానంలోనే ప‌రీక్షను నిర్వహించ‌నున్నారు. పరీక్షా కేంద్రంలోని అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు చిన్న శానిటైజ‌ర్ బాటిల్‌కు మాత్రమే అనుమ‌తిస్తారు. ప్రతి విద్యార్థి త‌ప్పనిస‌రిగా మాస్కు ధ‌రించాలి. షూ, ఫుల్ హ్యాండ్ ష‌ర్ట్స్, పెన్నులు, ఆభ‌ర‌ణాలు, వాట‌ర్ బాటిల్స్‌కు అనుమ‌తి లేద‌ని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు

Tags:    

Similar News