Navjot Sidhu: అమరీందర్ సింగ్‌కు నవజ్యోత్ సింగ్ సిద్ధు కౌంటర్
Navjot Sidhu: స్వలాభం కోసమే కెప్టెన్ కొత్త పార్టీ అని కామెంట్
అమరిందర్ సింగ్ కు కౌంటర్ ఇచ్చిన నవజోత్ సిద్దు (ఫైల్ ఇమేజ్)
Navjot Sidhu: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కామెంట్స్‌పై నవజ్యోత్ సింగ్ సిద్ధు కౌంటర్ ఇచ్చారు. కెప్టెన్‌ను ప్రతికూల శక్తిగా అభివర్ణించారు సిద్ధూ పంజాబ్‌లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తూ తనపై విమర్శలు చేయడాన్ని సిద్ధూ తీవ్రంగా తప్పుబట్టారు. ఈడీని ఉసిగొల్పడంతోనే అమరీందర్ బీజేపీలో పంచన చేరారని హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. గతంలో అమరీందర్ పార్టీని ఏర్పాటు చేస్తే కేవలం 856 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. పంజాబ్ ప్రయోజనాల కోసం రాజీపడిన కెప్టెన్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని ట్వీట్ చేశారు.