ప్రాక్టీస్‌ చేస్తుండగా.. విరిగిపడిన బాస్కెట్‌బాల్‌ పోల్‌..

Basketball Player Dies: హర్యానాలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ప్రమాదం జరిగింది.

Update: 2025-11-26 06:58 GMT

ప్రాక్టీస్‌ చేస్తుండగా.. విరిగిపడిన బాస్కెట్‌బాల్‌ పోల్‌..

Basketball Player Dies: హర్యానాలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ప్రమాదం జరిగింది. రోహ్‌తక్‌కు చెందిన జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు.. లఖన్ మజ్రాలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేసే సమయంలో బాస్కెట్‌బాల్ హుప్‌ను పట్టుకొని వేలాడుతుండగా.. పోల్‌ విరిగి అతనిపై పడింది. దీంతో అతన్ని తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం బహదూర్‌గఢ్‌లోని హోషియా‌ర్‌ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో క్రీడాకారులు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News