ఉగ్రవాద సంస్థకు ఫండింగ్ చేస్తున్న నెట్‌వర్క్ గుట్టు రట్టు

హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ సంస్థకు ఫండింగ్ చేస్తున్న నెట్‌వర్క్ గుట్టు రట్టు చేసింది ఎన్‌ఐఏ.

Update: 2020-05-09 13:05 GMT

హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ సంస్థకు ఫండింగ్ చేస్తున్న నెట్‌వర్క్ గుట్టు రట్టు చేసింది ఎన్‌ఐఏ. ఇందుకోసం పంజాబ్ , హర్యానా పోలీసుల సహాయం తీసుకుంది. టెర్రర్ ఫండింగ్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆల్రెడీ ఇందులో కొంతమంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. రాక్ సాల్ట్ ముసుగులో పాకిస్తాన్ నుండి డ్రగ్స్ భారతదేశానికి పంపినట్లు ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. వారి అమ్మకాల నుండి వచ్చిన డబ్బును హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చేరేది. ఇందులో కాశ్మీర్ కు చెందిన హిలాల్ అహ్మద్ వేజ్‌ను ఎన్‌ఐఏ ఏప్రిల్ 25 న అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించిన తరువాత ఈ రాకెట్ గురించి సమాచారం అందింది. న్యూస్ ఏజెన్సీ ప్రకారం, పాకిస్తాన్ భారతదేశానికి రాక్ సాల్ట్ ను ఎగుమతి చేస్తుంది..

ఈ ముసుగులో డ్రగ్స్ కూడా రహస్యంగా సరఫరా చేస్తున్నారు.. అయితే గుట్టుగా సాగుతోన్న ఈ వ్యవహారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు చేధించాయి. దాంతో ఎన్‌ఐఏకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. ఫండ్ సప్లయర్ ఆయన అహ్మద్ వేజ్‌ ద్వారా మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో అమృత్సర్‌కు చెందిన ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతను పలువురికి డబ్బు పంపించేవాడని తేల్చారు.. అతని సోదరుడు మనీందర్‌ను మే 5 న అరెస్టు చేశారు. హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు జరిగాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ నుండి కొంతమంది ఉన్నారు.

Tags:    

Similar News