ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం: మోడీ

Update: 2019-08-08 14:58 GMT

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తాము ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా కాశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు అభినందనలు తెలిపిన మోడీ జమ్ము కాశ్మీర్ లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. ఇది దేశచరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏల రద్దుతో పటేల్, అంబేద్కర్ ల స్వప్నం సహకారమైందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని చెప్పారు.

ఆర్టికల్ 370, 35ఏను అడ్డుపెట్టుకుని జరిగిన అన్యాయం వెనుక పాక్ ఉందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ ఆర్టికల్ ఇప్పటి వరకు ఉద్రవాదులకు ఆయుధంలా మారిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్నారని అసలు, కశ్మీరీలు చేసిన నేరమేంటి..? కశ్మీరీ పిల్లలు, మహిళలు చేసిన తప్పేంటని మోడీ ప్రశ్నించారు. కాశ్మీరులో జరగిన దాడుల్లో సుమారు 45వేల మంది అమాయకులు చనిపోయారని తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడే ఏ చట్టము జమ్మూకాశ్మీర్ లో అమలుకాలేదన్నారు మోడీ. ఆర్టికల్ 370తో ఉగ్రవాదులకు మేలు జరిగిందని ఈ ఆర్టికల్ రద్దుతో ఇక కాశ్మీర్ లో అభివృద్ది జరుగుతుందని చెప్పారు. 

Tags:    

Similar News