కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్‌ ఇవ్వండి ప్లీజ్ : రాజీవ్ హత్యకేసు నిందితురాలు

Update: 2019-04-29 02:39 GMT

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో 28 ఏళ్లుగా.. జైల్లో ఉన్న మహిళా ఖైదీ నళిని ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్‌ ఇమ్మని అడుగుతోంది. అయితే పాతికేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్‌ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. కుమార్తె పెళ్ళికి హాజరు కావాలని తనను విడుదల చెయ్యాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.

అయితే కోర్టు ఆమె అభ్యర్థనపై విచారణను జూన్‌కి వాయిదా వెయ్యడంతో ఆమె ఇంకో రెండు నెలల పాటు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజీవ్‌ హత్యోదంతంలో అరెస్ట్‌ అయ్యేనాటికే నళిని గర్భవతి. విచారణ ఖైదీగా ఆమెను వెల్లూరులోని మహిళా జైల్లో ఉంచారు. రెండేళ్ల క్రితమే ఆమె విడుదల అవుతుందని అందరూ భావించారు.. కానీ ఆమె విడుదల కాలేదు కదా.. ఆమె ఆత్మకథ మాత్రం విడుదలైంది. 500 పేజీల ఆ తమిళ పుస్తకాన్ని ఎండిఎంకె నేత వైకో ఆవిష్కరించారు. 

Similar News