Uttar Pradesh: మామపై తిరుగుబాటు జెండా ఎగరేసిన కోడలు

Uttar Pradesh: బీజేపీలోకి ములాయం చిన్న కోడలు

Update: 2022-01-19 02:29 GMT

 బీజేపీలోకి ములాయం చిన్న కోడలు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ నువ్వా-నేనా అంటూ ఎన్నికల్లో తలబడుతున్న తరుణంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు- ప్రతీక్ యాదవ్ సతీమణి సమాజ్‌వాదీ పార్టీ నేత అపర్ణాయాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. ఎస్పీకి గుడ్ బై చెప్పిన అపర్ణసింగ్ యాదవ్ నేడు బీజేపీలో చేరనున్నారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అపర్ణా యాదవ్ కొద్దికాలంగా బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అదే ఇప్పుడు నిజం కాబోతుంది. గతంలో ఆమె అనేకసార్లు నరేంద్ర మోదీ నిర్ణయాలను బహిరంగంగానే సమర్ధించారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు.

అపర్ణాయాదవ్‌కు లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.కుటుంబ విభేదాలు.. ఎన్ఆర్‌సీ, రామ మందిరం సహా పలు అంశాల విషయంలో అపర్ణా యావద్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య కొద్దికాలంగా విభేదాలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో రామ మందిర నిర్మాణానికి ఆమె 11 లక్షలు విరాళం కూడా ఇచ్చారు. గతంలో తన కుటుంబ సభ్యులు చేసిన దానికి తాను బాధ్యురాలిని కాదని ఆమె అన్నారు. ఇది నేరుగా ములాయం సింగ్‌పై చేసిన తిరుగుబాటుగా ప్రచారమైంది. 2017లో యూపీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్టుపై పోటీచేసిన అపర్ణా యాదవ్ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.

Tags:    

Similar News