Lockdown Effect: అంబానీకి భారీ నష్టం.. 2 నెలల్లో ఎంత కోల్పోయారంటే

కరోనా వైరస్‌ అన్ని రంగాపై ప్రభావం చూపిస్తుంది.ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది.

Update: 2020-04-06 15:45 GMT
Mukesh Ambani (File Photo)

కరోనా వైరస్‌ అన్ని రంగాపై ప్రభావం చూపిస్తుంది.ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సామాన్యుడి నుంచి కుబేరుడి వరకు అందరిపైనా ప్రభావం చూపిస్తోంది. తాజాగా అపర కుబేరుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

గత రెండు నెలల్లో అంబానీ మార్చి 31నాటికి రోజుకి 300 మిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. దీంతో అంబానీ 19 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో 8వ స్థానానికి పడిపోయినట్లు హురున్ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ అనే సంస్థ పేర్కొంది.

ఇక మరో భారత్ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ 37 శాతం, ఉదయ్‌ కొటక్‌ 28 శాతం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌ నాడార్ 26 శాతం మేర సంపదను కోల్పోయినట్లు సదరు సంస్థ వెల్లడించింది. దీంతో ఈ కుబేరులు ఎవరు టాప్‌ 100 జాబితాలో కూడా లేరు. మొదటి సారు వారి స్థానాలు కోల్పోయారని ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ మాత్రమే టాప్‌ 100 జాబితాలో కొనసాగుతున్నారు.

స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత్‌లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు 26 శాతం మేర సంపదను కోల్పోయారు. అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ 5.2 శాతం మేర పడిపోయింది. ఇక మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ్య ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎమ్‌హెచ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ బెర్నాడ్ ఆర్నాల్ట్‌ ఉన్నారు.

Tags:    

Similar News