Kerala: సముద్రంలో మునిగిన ఓడ.. భారత తీర ప్రాంతానికి ప్రమాదం తప్పదా..!

Kerala: కేరళ తీరానికి సమీపంగా అరేబియా సముద్రంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. MSC ELSA 3 అనే లైబీరియన్ నౌక విజింజం పోర్టు నుంచి కొచ్చికి బయలుదేరింది. కానీ, కొచ్చి తీరానికి కేవలం 38 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చేసరికి... ఒక్కో కంపార్ట్మెంట్స్‌లోకి నీరు చేరడం ప్రారంభమైంది.

Update: 2025-05-29 00:30 GMT

Kerala: సముద్రంలో మునిగిన ఓడ.. భారత తీర ప్రాంతానికి ప్రమాదం తప్పదా..!

Kerala: కేరళ తీరానికి సమీపంగా అరేబియా సముద్రంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. MSC ELSA 3 అనే లైబీరియన్ నౌక విజింజం పోర్టు నుంచి కొచ్చికి బయలుదేరింది. కానీ, కొచ్చి తీరానికి కేవలం 38 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చేసరికి... ఒక్కో కంపార్ట్మెంట్స్‌లోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది.

ఈ నౌక లోపల ఏం ఉందో తెలుసా? 640 కంటైనర్లు! అవును అక్షరాల 640 కంటైనర్లు ఉన్నాయి.. వాటిలో 13 కంటైనర్లు ప్రమాదకర రసాయనాలతో, మరో 12 కంటైనర్లు కాల్షియం కార్బైడ్‌తో నిండి ఉన్నాయి. ఇది ఉప్పు నీటితో కలిస్తే పేలే గ్యాస్‌ను విడుదల చేస్తుంది. అంటే, సముద్రంలో ఎక్కడైనా ఇది రియాక్ట్ అయితే, అది ఒక రసాయన బాంబుగా మారే అవకాశం ఉందన్నమాట. ఇంతే కాదు.. ఈ నౌక ట్యాంకుల్లో 84 టన్నుల డీజిల్, 367 టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నాయి. ఇవి తీరానికి కొట్టుకొస్తే? అది చనిపోయే చేపల గురించే కాదు, మత్స్యకారుల జీవనాధారానికి గట్టి దెబ్బ. ఇక ఇప్పటికే కొన్ని కంటైనర్లు ఒడ్డుకు చేరుతున్నట్టు సమాచారం. ఏ కంటైనర్‌నయినా తాకొద్దంటూ.. చమురు అయితే అసలు వాటి దగ్గరికి కూడా వెళ్లొద్దనీ... మత్స్యకారులను నౌక దిశగా పడవలు తిప్పకండి అంటూ అధికారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ మునిగిన ఓడలోని 24 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ సురక్షితంగా రక్షించింది. ఇది ఒక పాజిటివ్ విషయం. కానీ ప్రమాదం మాత్రం ఇంకా అలానే ఉంది.

ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. ఒక స్పెషల్ ఓడను, అవసరమైన పరికరాలతో సంఘటనాస్థలానికి పంపింది. పైగా, ఆయిల్ స్పిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి, ఓ ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా సర్వే చేపట్టింది. నిజానికి కేరళ తీరప్రాంతం అంటే జీవ వైవిధ్యానికి కేంద్రం. పర్యాటకానికి ప్రాణం. అలాంటి ప్రాంతంలో ఇది ఒక పర్యావరణ అత్యవసర పరిస్థితి. ఈ ప్రమాదాన్ని ఏ మేరకు నియంత్రించగలుగుతామన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక ఇది కేవలం ఒక ఓడ మునిగిన వార్త మాత్రమే కాదు. ఇది మన తీర ప్రాంత భద్రతకు, పర్యావరణ సంరక్షణకు, సముద్ర జీవనానికి ఘోర హెచ్చరిక! అధికారుల చర్యలు వేగంగా ఉండాలి... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ప్రస్తుతం ఇది ఓ ప్రమాదం మాత్రమే… కానీ నిర్లక్ష్యమైతే, దీని పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు!

Tags:    

Similar News