గుజరాత్ లో ఘనంగా వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే

Gujarat: *రాష్ట్రవ్యాప్తంగా హాజరైన 32జంటలు *16నగరాల నుంచి తరలి వచ్చిన దివ్యాంగులు

Update: 2022-03-22 04:00 GMT

గుజరాత్ లో ఘనంగా వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే 

Gujarat: దివ్యాంగులు అనగానే డిసేబుల్డ్ అనుకునే రోజులు పోయాయి. మేము కూడా ఎందులో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు వికలాంగులు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నవజీవన్ చారిటబుల్ ట్రస్ట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ దివ్యాంగ్ ప్రత్యేక కార్యక్రమానికి 16 నగరాల నుంచి తరలి వచ్చిన 32 మంది ఈవెంట్ లో సందడి చేశారు.

ఆటలు, పాటలు, డాన్స్, మిమిక్రీ ఇలా ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించారు. ఈవెంట్ కు హాజరైన జంటలు ర్యాంప్ పై అదరగొట్టాయి. ఇక్కడ గెలిచిన జంటలు ముంబైలో జాతీయ స్థాయిలో పోటీ పడనున్నాయి. భవిష్యత్తులో ఫ్యాషన్, మోడల్ రంగంలోకి వెళ్లేందుకు ఈ ఈవెంట్ ఎంతో దోహదం చేస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈవెంట్ కు హాజరైన ప్రతినిధులకు ర్యాంప్ వాక్, డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చేందుకు కొరియోగ్రాఫర్లను నియమించారు. దివ్యాంగులకు డ్యాన్స్ లో శిక్షణ ఇవ్వడంలో కొన్ని సమస్యలు ఉంటాయని అయినా వాటిని అధిగమించామంటున్నారు కొరియో గ్రాఫర్.

Tags:    

Similar News