Maoist: మావోల కదలికలు.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్

Maoist: ఏజెన్సీలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

Update: 2023-11-22 07:45 GMT

Maoist: మావోల కదలికలు.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్

Maoist: తెలంగాణ ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్‌గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ పేర్లను విడుదల చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏజెన్సీలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల మావోయిస్ట్ పార్టీ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News