Monkey Theft 20 Lakhs Bag: 20లక్షలున్న బ్యాగును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయింది.. మరి ఆ తర్వాత ఏం జరిగింది?

Monkey Snatches: గుడికి వెళ్లినప్పుడు టోపీలు, కళ్లజోళ్లు, తినేపదార్దాలను కోతులు ఎత్తుకెళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం.

Update: 2025-06-14 12:32 GMT

Monkey Theft 20 Lakhs Bag: 20లక్షలున్న బ్యాగును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయింది.. మరి ఆ తర్వాత ఏం జరిగింది?

Monkey Snatches: గుడికి వెళ్లినప్పుడు టోపీలు, కళ్లజోళ్లు, తినేపదార్దాలను కోతులు ఎత్తుకెళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఈ కోతి ఏకంగా 20లక్షల విలువైన బంగారం ఉన్న బ్యాగునే ఎత్తికెళ్లిపోయింది. ఇంతకీ ఈ కథ ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? అయితే పదండి మీకే తెలుస్తుంది.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం బీహార్‌‌లోని బృందావన్ లో ఉన్న బంకే బిహారీ ఆలయానికి అలీఘర్‌‌కు చెందిన వజ్రాల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. అయితే ఆ రోజు అతని భార్య 20లక్షల విలువైన నగలను ధరించి ఉంది. అయితే గుడిలో ఎవరైనా తన ఆభరణాలను దొంగిలించే ప్రమాదం ఉందని అవన్నీ తీసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత దర్శనానికి వెళ్లి తమ కారు దగ్గరకు తిరిగి వస్తుండగా ఒక కోతి పరుగు పరుగున వచ్చిన ఆమె చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాంగ్‌ను ఎత్తుకెళ్లిపోయింది. దాన్ని పట్టుకుందామని వెనకాల పరుగుపెడితే చిన్న సందులున్న వీధుల్లోకి వెళ్లిపోయింది. దీంతో చేసేదేమీ లేక అగర్వాల్ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు విచారణ జరిపిన తర్వాత సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసారు. అలా సీసీటీవీ సహాయంతో ఆ కోతి తిరిగిన ప్రాంతాలన్నింటినీ చూసి.. ఫాలో చేశారు. అప్పుడు ఒక చెట్టు పైన ఈ బ్యాగ్ కనిపించింది. దీంతో పోలీసులు ఆ బ్యాగ్‌ని తీసి అగర్వాల్ భార్యకు అందించారు. అయితే కోతి ఈ బ్యాగ్‌ని పట్టుకెళ్లిన 8 గంటల తర్వాత ఈ బ్యాగు ఉన్న చోట గుర్తుపట్టాల్సి వచ్చింది. ఏది ఏమైనా గుళ్లు దగ్గరకు వెళ్లేటప్పుడు జర భద్రంగా ఉండాలి మరి. 

Tags:    

Similar News