Narendra Modi: రెమాల్ తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష
Narendra Modi: అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ప్రధాని మోడీ రివ్యూ
Narendra Modi: రెమాల్ తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష
Narendra Modi: కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కాషాయ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కన్యాకుమారిలో దాదాపు 45 గంటల పాటు ధ్యానం ముగించుకున్న ప్రధాని మోడీ.. వివిధ అంశాలపై సమీక్షలతో బిజీ బిజీగా గడిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన తొలి 100 రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రెమాల్ తుపాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ తొలుత రివ్యూ నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో చోటు చేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్ష నిర్వహించారు. వీటితో పాటు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపైనా ఉన్నతాధికారులతో చర్చించారు.