PM Modi: దేశంలోనే అతిపొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

PM Modi: రూ.17,840 కోట్ల ఖర్చుతో నిర్మించిన వంతెన

Update: 2024-01-12 12:32 GMT

PM Modi: దేశంలోనే అతిపొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

PM Modi: దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నగర ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్‌లో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. రోడ్డు నుంచి సముద్రం మీదుగా రోడ్డుకు చేరే విధంగా వంతెన నిర్మించేందుకు 2016 డిసెంబర్‌లో ఈ బ్రిడ్జికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన 21.8 కిలోమీటర్ల సిక్స్ లేన్‌లుగా బ్రిడ్జిని నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటించిన మోడీ రూ.30,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు. రోడ్‌ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ అటల్‌ సేతు నిర్మాణం ముంబై ప్రజల కష్టాలను తీర్చనుంది అన్నారు.

దేశంలోనే 21.8 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అతిపెద్ద సముద్ర వంతెన అటల్‌ సేతు.. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ముంబై నుండి నవీ ముంబై చేరుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ముంబై మహానగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు ఇది చెక్‌పెట్టనుంది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రి నుండి ప్రారంభమై ఎలిఫెంట్ ఐలాండ్‌కు ఉత్తరాన థానే క్రీక్‌ను దాటి చిర్లే గ్రామంలో ముగుస్తుంది. ముంబై, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య స్పీడ్‌ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.. పుణే, గోవాలకు కూడా తక్కువ సమయంలో ప్రయాణించవచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ ద్వారా ఫోర్‌వీలర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. బైక్‌లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్ల రాకపోకలకు ఈ బ్రిడ్జిపై నిషేధం విధించారు.

Tags:    

Similar News