Cooking oil: వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం

Cooking oil: క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించింది. 10 శాతానికి తగ్గించింది.

Update: 2021-06-30 05:31 GMT

Cooking oil:(File Image)

Cooking oil: ప్రపంచాన్ని వణికించిన కరోనా తో ఉద్యోగాలు కో్ల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో వంట నూనెల ధరలు ఆమాంతం పెరిగి గోటిచుట్ట పై రోకటి పోటులా మారిపోయింది. దీంతో అందరిలో వ్యతిరేకత రావడంతో కేంద్రం ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించింది. 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గే అవకాశముంది.

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి తగ్గింది. అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 37.5 శాతానికి దిగొచ్చింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత వూరట కలుగుతుంది. కానీ అస్సలు సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News