Sanjay Raut: సంకీర్ణ ప్రభుత్వాన్ని మోడీ నడపలేరు
Sanjay Raut: ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే వారికి మద్దతిస్తారని తాను అనుకోను
Sanjay Raut: సంకీర్ణ ప్రభుత్వాన్ని మోడీ నడపలేరు
Sanjay Raut: సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ నడపలేరని మహారాష్ట్రకు చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీయేలో కీలకమైన నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరికీ స్నేహితులని ఆయన తెలిపారు. బీజేపీకి మెజారిటీ లేకపోవడంతోనే.. ఇప్పుడు పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ అందరికీ మిత్రులే. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తెచ్చే వారికి చంద్రబాబు, నితీష్ మద్దతిస్తారని తాను అనుకోవడం లేదన్నారు సంజయ్ రౌత్. మోదీకి గ్యారెంటీ అంటూ తనదైన ధోరణిలో మాట్లాడిన ప్రధాని ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.